BJP Lead in Goa Assembly Elections 2022. 14 Congress MLA Candidates also Lead. Camp Politics Starts at Goa Congress.
దేశమంతా ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్ 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడుతున్నాయి. 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అయితే గత పంజాబ్ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఈ సారి పంజాబ్‌ను కూడా చేజార్చకుంటున్నట్లు కనిపిస్తోంది. పంజాబ్ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. అయితే గోవాలో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా కనిపిస్తోంది. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 21గా ఉంది. అయితే ప్రస్తుతం వెలువడిన ఓట్ల ఫలితాల ప్రకారం.. బీజేపీ అభ్యర్థులు 19 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు 14 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
తృణమూల్‌తో పాటు ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే గత గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అభ్యర్థులకు మధ్య పోటాపోటీ నడిచి, చివరికి క్యాంప్ రాజకీయల మలుపుతో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాషాయం కండువా కప్పుకొని బీజేపీని అధికారంలోకి తీసువచ్చారు. ఇప్పుడుకూడా అలాంటి పరిస్థితులు తలెత్తకముందు కాంగ్రెస్ పెద్దలు జాగ్రత్త పడుతున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులను ముందుగానే క్యాంపులకు తరలిస్తున్నారు. చూడాలి మరి.. గోవాలో కాషాయం జెండా ఎగుతుందా.. లేక.. హస్తం గెలుస్తుందా..? అని.