తమిళనాడులో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వ్యూహరచన చేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేతో మరోసారి పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కలిసి సుముఖత తెలిపారు. అయితే బీజేపీతో పొత్తుకు షరతులు విధించారు. Also Read: One Nation…
PM Modi: తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఈరోజు (ఏప్రిల్ 6న) శ్రీ రామనవమి సందర్భంగా మధ్యాహ్నం 12.45 గంటలకు పంబన్ బ్రిడ్జిను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న మోడీ..
ఏపీ కూటమిలో బీజేపీకి విలువ లేకుండా పోతోందా? వాళ్ళకు అది చాలనా? లేక అంతకు మించి అవసరం లేదనా? పదవుల పంపకాల్లో టీడీపీ, జనసేన సింహభాగం తీసుకుంటున్నా…. కాషాయ పార్టీకి కనీస మాత్రంగా కూడా కాకుండా.. ఏదో… విదిలించినట్టు వేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? పదవుల పందేరంలో మూడు పార్టీల మధ్య అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్ కమిటీ పదవుల పందేరం నడుస్తోంది. సహజంగానే అందులో ఎక్కువ శాతం టీడీపీ తీసుకుంటోంది. అలాగే జనసేనకు కూడా ఓకేగా…
Ponguleti Sudharkar Reddy : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై దేశవ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోందని, ఆయన నాయకత్వంపై ప్రజలు మరింత ఆకర్షితులవుతుండటంతో, కొన్ని పార్టీలు మోడీ పై తప్పుడు ప్రచారానికి తెగబడుతున్నాయని ఆరోపించారు. ‘ఉత్తర–దక్షిణ’ అనే వాదనను ప్రొత్సహించి మోడీ గారిపై విమర్శలు చేస్తుండటం రాజ్యాంగ ఉల్లంఘనగా అభివర్ణించారు. కర్ణాటకలో ఎప్పుడెన్నికలు జరిగినా బీజేపీ గెలుస్తోందని, తమిళనాడులోనూ రాజకీయ సమీకరణాలు…
కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి…
3వ తేదీన లోక్ సభలో, 4న రాజ్యసభలో పాస్ అయింది వక్ఫ్ బిల్లు.. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశాం.. 92 లక్షలకు పైగా పిటిషన్స్ జేపీసీకి వచ్చాయి.. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డులు వాళ్ళ రిప్రెజెంటేషన్ ఇచ్చారు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చింది.
JDU: బీహార్‌లో ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉంది. ఈ సమయంలో జేడీయూ పార్టీ ‘‘వక్ఫ్ బిల్లు’’ కల్లోలంలో ఇరుక్కుంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి చెందిన మైనారిటీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా, మరో నేత పార్టీని వీడారు. తాజాగా, ఆ పార్టీ యూత్ వింగ్ ఉపాధ్యక్షుడు తబ్రేజ్ హసన్ పార్టీకి రాజీనామా చేశారు.
Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని…
Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అన్నామలై నిర్ణయం షాక్‌కి గురిచేసింది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గత వారం అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలోనే అన్నామలై పార్టీ…
Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నంటున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకువచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు.