తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ అన్నారు. మెదక్ జిల్లాలో శనివారం ఉదయం కేంద్రమంత్రి గెస్ట్హౌజ్కు వచ్చినప్పటీకీ ఆర్అండ్బీ అధికారులు తాళం తీయని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. అయితే.. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పథకాలు తెలంగాణలో అమలు చేయడం…
తెలంగాణ వచ్చి ఇప్పటికి 8 ఏళ్లయింది. 2014 జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేదా అని ప్రశ్న ఇవాళ తలెత్తుతోంది. దీనికి కారణం ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు. దీనికీ దానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా?. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం. 18 ఏళ్ల కిందట కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. అప్పుడేమో…
నగరంలో.. టీఆర్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ జాతీయ మహాసభ నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, నిర్వహించబోయే ర్యాలీలకు పోటీగా టీఆర్ఎస్ పార్టీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రోటోకాల్ పాటించకపోయినా పర్వాలేదు కానీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రయోగశాలగా వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. అయితే.. రెండు రోజుల సమావేశాలు మాదాపూర్ హెచ్ఐసీసీలోని నోవాటెల్ హోటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు స్వాగతం పలికేందుకు బీజేపీ భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. టీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో నిరసనలు తెలపడానికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఈపబ్లిసిటీ స్టంట్.. మాటల యుద్ధం రెండు రోజులకే పరిమితమవుందా అనే ప్రశ్న, లేక…
అందరి చూపు ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది.. భారతీయ జనతా పార్టీ బడా నేతలంతా హైదరాబాద్కు చేరుకుంటున్నారు.. కాసేపట్లో హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, కీలక నేతలు నగరానికి చేరుకుంటున్నారు.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా.. తదితరులు రానుండా.. ఇక, ప్రధాని నరేంద్ర…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యోగికి శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి భారీగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ ఇంటర్నేషనల్…
నేడు భాగ్యనగరానికి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు యశ్వంత్ సిన్హా చేరుకుంటారు. సిన్హాకు స్వాగతం పలికేందుకు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. అనంతరం బేగం పేట్ నుంచి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టిఆర్ఎస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అనంతరం 3.30 గంటలకు ఐటీసీ కాకతీయలో ఎంఐఎం ఎంపీ, ఎమ్మెల్యేలతో…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ నేడు నగరానికి రానున్నారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ నగరం అంతా కషాయి జండాలతో రెపలాడుతున్నాయి. మోడీ ని ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ వస్తున్న ప్రధానిమోదీకి స్వాగతం పలికే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు సీఎస్…