రాష్ట్రంలో బీజేపీ గెలవదని మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాగో విజయం సాధించలేమని ఇప్పుడు విజయ సంకల్ప ముందే పెట్టుకున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం కూడా గొప్పేనని ఆమె అన్నారు. ఒక ఆదివాసీ మహిళకు మంచి చేస్తే అందరి కడుపు నిండదని… ద్రౌపది మూర్ము రాష్ట్రపతి అయితే ఆదివాసీలకు ఒరిగేది ఏముందని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కళ్లు ఉండి చూడలేని కబోదులని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో అవినీతి జరుగుతుంది అనుకుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు.
Uttamkumar reddy: హైదరాబాద్ సభలో మోడీ ప్రసంగం అట్టర్ ప్లాప్
కుటుంబ పాలన అని కేటీఆర్, కేసీఆర్ మీద ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి కుటుంబం లేకపోతే దేశంలో ఎవరికి కుటుంబం ఉండకూడదా అంటూ మండిపడ్డారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య చాలా గ్యాప్ ఉందన్నారు. తాము అడిగిన అనేక పథకాలు, నిధులపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పెద్దగా స్పందించలేదని ఆమె ధ్వజమెత్తారు.