Minister KTR: కిషన్ రెడ్డివన్నీ తప్పుడు లెక్కలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Fires On Kishan Reddy Over Centre Funds: తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం వరద సహాయంపై కిషన్ రెడ్డి చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్(NDRF), ఎస్డీఆర్ఎఫ్(SDRF) మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. ఎన్డీఅర్ఎఫ్ ప్రత్యేక నిధులపైన కిషన్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని కౌంటర్ వేశారు. ఎన్డీఅర్ఎఫ్ ద్వారా కేంద్రం ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్టికల్ 280 ప్రకారం.. రాష్ట్రానికి రాజ్యాంగబద్దంగా, హక్కుగా దక్కే ఎస్డీఆర్ఎఫ్ గణాంకాల పేరుతో కిషన్ రెడ్డి ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహించారు. రాష్ట్రంలో ఎలాంటి విపత్తుల్లేకుండా ఎస్డీఆర్ఎఫ్ నిధులు వస్తాయని.. కానీ కిషన్ రెడ్డి మాత్రం తాము వాటిని ప్రత్యేకంగా ఇస్తున్నట్టు అబద్ధాలు చెప్తున్నారన్నారు. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు తప్ప.. కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కిందేమిటో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. 2018 నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా ఇవ్వలేదని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్ రెడ్డికి హితవు పలికారు. ఎవరు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారో కిషన్ రెడ్డి చెప్పాల్సిందేనని మంత్రి కేటీఆర్ అడిగారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!