తెలంగాణలో మరోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయా? దీనిపై గతంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఏంటి? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరుగుతోంది? ముఖ్యమంత్రి ప్రకటనలో నర్మగర్భ సంకేతాలు ఉన్నాయా? రాజకీయ వాతావరణం కలిసి వస్తే ముందస్తుకు సై అంటారా? ఈ వ్యాఖ్యలపైనే తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. రాష్ట్రంలో మరోసారి ముందస్తు ఎన్నికలు జరుగుతాయా అని అంతా ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. సీఎం…
గోవాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. అక్కడి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి దిగంబర్ కామత్తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ ఉన్నారన్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవాలో కాంగ్రెస్ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తోందని, తమ పార్టీలో చేరితో రూ. 50 కోట్లు ఇస్తామంటూ కాషాయ పార్టీ కాంగ్రెస్ నేతలకు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం ఒక్క గోవాలోనే కాదు.. ప్రతీ…
తెలంగాణలో యూపీ తరహా పాలన రావాలని.. కేసీఆర్ ఫైటర్ కాదు చీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత కే. లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా వస్తున్న ఫలితాలు, జాతీయ కార్యవర్గ సమావేశం, విజయ సంకల్ప సభకు భారీగా జనాలు రావడాన్ని కేసీఆర్ సహించలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయని.. మోదీ గురించి మాట్లాడే స్థాయి నీది కాదని ఆయన అన్నారు. మోదీ పద్మ అవార్డులు, రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక…
సీఎం కేసీఆర్ పై రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్ అయ్యాడు. ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ఆయన సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నీ ప్రభుత్వం, నీ విధానాలపై నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని.. మేము కూడా సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ కు సవాల్ విసిరారు లక్ష్మణ్. ఎప్పుడు ఈ పీడను వదులుకుందామా, ఈ అవినీతి ప్రభుత్వాని తరిమి…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఠాయికి మించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూపీ సీఎం యోగి గురించి మాట్లాడారని.. మోదీకి, యోగికి కుటుంబ రాజకీయాలు లేవని గుర్తు చేశారు. యోగీ వేసుకున్న బట్టల గురించి లుంగీ గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కుటుంబ పెత్తనం లేకుండా ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం జీవిస్తున్నారని.. కానీ మీరు మీ కుటుంబం వారసత్వం కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం, అహంకారం కోసం పాలిస్తున్నారని విమర్శించారు.…