Revanth Reddy: హైదరాబాద్‌కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 పై టీఆర్‌ఎస్, బీజేపీ లు డ్రామాలు అడుతున్నాయన్నారు. హైదరాబాద్‌కి స్వాతంత్రం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. మన పేటెంట్‌ని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని కేసీఆర్, మెజారిటీ ప్రజలకు అండగా ఉన్నామని బీజేపీ నాటకాలు అడుతున్నాయన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు.. రాచరికనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం అని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సెప్టెంబర్ 17 2022 – సెప్టెంబర్ 17 2023 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని, తెలంగాణను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారన్నారు. ఉద్యమంలో వాహనాలకు టీజీ ఉంది.. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి పార్టీకి గుర్తుగా దానిని టీఎస్‌గా మార్చారన్నారు.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
మనం వచ్చిన తరువాత దానిని టీజీగా మారుస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర విభజన జరిగిన తరువాత దానిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ వచ్చిన తరువాత అందే శ్రీ రాసిన జయ జయహే తెలంగాణను అధికార గీతంగా చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. టీఆర్‌ఎస్ సృష్టించిన తెలంగాణ తల్లి కాకుండా.. సబ్బడ్డ వర్గాలకు సంబంధించిన తెలంగాణ తల్లిని గ్రామగ్రామాన విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని, పక్క రాష్ట్రాల్లో జాతీయ జెండాతో పాటు రాష్ట్ర ప్రభుత్వంకి ప్రత్యేక ఫ్లాగ్ ఉంటుంది..మనం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ఫ్లాగ్ రూపొందిస్తామన్నారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!