కేంద్రం బోర్లకు మీటర్లు పెడతామని ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయితే.. రైతులకు సబ్సిడీ ఇవ్వొద్దని చెప్పలేదని వివరించారు. తెలంగాణ పేదలకు సబ్సిడీ పథకాలు అమలు చేసేందుకు కేంద్రం ఎప్పుడు ముందుంటుందన్నారు. కానీ.. సీఎం కేసీఆర్ శాసనసభలో కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. డిస్కంలు, డిస్ట్రిబ్యూటర్లు, జెన్ కో, ట్రాన్స్ కో కంపెనీలకు బకాయిలు చెల్లించాలని తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరిందని గుర్తు చేశారు ఈటెల.
ఇక కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్తున్నారని.. బాయిలకాడ మోటార్లకు మీటర్లు పెడ్తదని, కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బోర్లకు మీటర్లు వస్తాయని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. అయితే.. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికతో మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం.. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా, మునుగోడులో బీజేపీయే గెలుస్తుందని స్పష్టం చేసిన ఆయన ఉప ఎన్నికలో కేసీఆర్కు మనమే మీటర్లు పెట్టాలని పిలుపునిచ్చారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మీటర్లు పెట్టారని ఈటల రాజేందర్ అన్నారు. అంతేకాకుండా.. బోర్లకు మీటర్లంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తూ, సైలెంట్గా విద్యుత్ చార్జీలు పెంచారని మండిపడ్డ ఈటెల.. కరెంట్ బిల్లులతో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Krishnam Raju: సాయినాథుని భక్తునిగా….