Nikhil: మొన్న తారక్.. నేడు నిఖిల్.. అమిత్ షా వ్యూహం అదే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil: టాలీవుడ్ ఇండస్ట్రీపై బీజేపీ కన్ను పడిందా..? అంటే నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే అది రాజకీయంగానా..? లేక కేవలం సినిమాలపరంగానా..? అనేది ఎవరికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది. మొన్నటికి మొన్న బీజేపీ నేత అమిత్ షా, ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్ర నచ్చడంతో తారక్ ను పర్సనల్ గా పిలిచి షా అభినందించారు. ఇక ఆ తరువాత నితిన్ ను బీజేపీ నేత జేపీ నడ్డా పర్సనల్ గా పిలిపించుకొని మాట్లాడారు. అయితే ఇందులో చిన్న పొరపాటు జరిగిందని, నిఖిల్ కు బదులు నితిన్ ను పిలిచారని కన్ప్యూజ్ సృష్టించారు. అందులో నిజమెంత అనేది ఇప్పటివరకు తెలియదు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మరోసారి అమిత్ షా, నిఖిల్ తో భేటీ అవ్వడానికి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే అమిత్ షా, మరికొంతమంది బీజేపీ నేతలు నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమాను వీక్షించారని, అందులో నిఖిల్ నటన, సినిమా కథకు సదురు నేతలు ఫిదా కావడంతో చిత్ర బృందాన్ని పర్సనల్ గా మీట్ అయ్యి అభినదించాలని అనుకుంటున్నారట. భారతీయ సంస్కృతిని, కృష్ణతత్వాన్ని ఎంతో అద్భుతంగా చూపించిన కార్తికేయ టీమ్ ను ముఖ్యంగా కార్తికేయ నటనకు షా ముగ్దుడయ్యాడట. తన మనసులో పెనవేసుకున్న భావాలను నిఖిల్ ను కలిసి చెప్పాలనుకుంటున్నారట. సెప్టెంబర్ 17 షా హైదరాబాద్ రానున్నారని తెలుస్తోంది. ఆరోజే నిఖిల్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా పరంగా పక్కన పెడితే.. ముందు వెనుక లేనిది సినిమాలు నచ్చి హీరోలను, రాజకీయ నేతలను కలవడం ఏంటి..? అందులోనూ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న సమయంలో స్వయానా బీజేపీ కీలక నేత అమిత్ షానే పిలిచి మరీ ప్రశంసించడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా..? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే హీరోలను ప్రచారాలు కోసం ఒప్పించే ప్లాన్ లో బీజేపీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Tags
- Amith Shah
- bjp
- karthikeya 2
- Nikhil
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!