ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు ప్రగతిశీల శక్తులతో కలిసి సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు.