ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ లెవల్లో చీకటి ఒప్పందం జరిగిందని విమర్శించారు జగ్గారెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ వంద కోట్లు సిద్ధం చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాయని మండిపడ్డారు.. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేయాలి అని పిలుపునిచ్చారు
కేంద్రం రాజగోపాల్ కాంట్రాక్ట్ డబ్బులు మునుగోడుకి ఇవ్వాలని మంత్రి కోరారు. 18 వేల కోట్లకు రాజగోపాల్ అమ్ముడు పోయారని ఆరోపించారు. రాజగోపాల్ కు డెడ్ లైన్ పెడుతున్నానని, తన సవాల్ స్వీకరించాలని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకో లేదంటే.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి రా.. మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని అంటూ ఛాలెంజ్ చేశారు.
ఇవాళ 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున నామినేషన్ పత్రాలను సమర్పించారు..
ప్రధాని మోడీ, అమిత్ షా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి... అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి