మునుగోడు ఉప ఎన్నికలో.. మద్యం ఏరులైపారుతోంది.. డబ్బులు పోటీపడి పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.. నోటిఫికేషన్ వెలువడక ముందు నుంచే.. బేరసారాలపై వార్తలు రాగా.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత.. ఇది మరింత పెరిగిందట.. అయితే, డబ్బులు ఎవరు ఇచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మీడియా చిట్‌చాట్‌లో ఆరోపించిన ఆయన.. కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పే కుట్ర నడుస్తుందని ఫైర్ అయ్యారు.. ఇక, మునుగోడులో జరిగిన అభివృద్ధి అంతా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి హయాంలోనే జరిగిందన్నారు.. టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దూషణలతో పోటీ రెండు పార్టీల మధ్యే ఉందనే కలర్ ఇస్తున్నాయని సెటైర్లు వేశారు జగ్గారెడ్డి.
Read Also: Chiranjeevi: గరికిపాటి వివాదంపై తొలిసారి రియాక్షన్.. అవసరం లేదంటూ తేల్చేశారు
టీఆర్ఎస్, బీజేపీ కుట్రలను మునుగోడు ప్రజలు గమనించాలని సూచించారు జగ్గారెడ్డి.. ఇక, కాంగ్రెస్ నేతలకు ఉన్నంత నిబద్ధత టీఆర్ఎస్, బీజేపీలకు ఉండదన్న ఆయన.. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన వాళ్లు అవుతారన్నారు.. మరోవైపు.. బీజేపీ మతం పెరుతో రెచ్చ గొడుతుంది అని మండిపడ్డారు.. టీఆర్ఎస్ ప్రజలకు ఆశ పెట్టి ఓట్లు వేయించుకుంటుందని విమర్శించారు. ప్రజలు ఆలోచన చేయండి.. ఉప ఎన్నికలో తాత్కాలిక సంతోషం కోసం చూడకండి.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఓటు వేయాలన్నారు.. డబ్బులు ఎవరిచ్చినా మీవే తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయండి అని సూచించారు జగ్గారెడ్డి. కాగా, రేపటితో మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా.. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఇప్పటికే జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని ఈ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డ ఆయన.. వంద కోట్ల రూపాయలు ఎన్నికల కోసం వాడుతున్నాయని… మోడీ- కేసీఆర్ స్థాయిలోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.