పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎప్పుడు ఏ నోట్లను రద్దు చేస్తారు? అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. కొన్ని నోట్ల ముద్రణ ఆగిపోయినా..? మార్కెట్లో కనిపించకపోయినా? ఏమైంది? ఏదో జరగబోతోంది? అవి కూడా రద్దు చేస్తారా? అనే ప్రచారం సాగుతూ వస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. రాజ్యసభలో ఇవాళ మోడీ మాట్లాడుతూ.. రూ.2000 నోట్లను దశలవారీగా రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. ఈ పెద్ద నోట్లు…
Ex Mp Ponnam Prabhakar: సింగరేణి బొగ్గు.. తెలంగాణ హక్కు అన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందని టీఆర్ఎస్ ఆరోపిస్తోందని అన్నారు. వాస్తవంగా సింగరేణి లో ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలని తెలిపారు. తాడిచెర్ల గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తాడిచెర్ల బొగ్గు గనులను జెన్కో ద్వారా ఏఎంఆర్ కంపెనీకి కట్టబెట్టారు. AMR కంపెనీకి…
స్వార్థం కోసం యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవ చేశారు. జగిత్యాల జిల్లాలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Delhi BJP Chief Reign: దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల(ఎంసీడీ)లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా పార్టీకి రాజీనామా చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గములో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. బీజేపీ ముఖ్యమంత్రి ముందుగా అభ్యర్థిని ప్రకటించదన్నారు. కొంత మంది కావాలని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
PT USHA: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో కొత్త శకానికి పునాది పడింది. పరుగు రాణిగా పేరొందిన పీటీ ఉష(58) ఒలింపిక్ సంఘం తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో ఆమె ఎన్నిక లాంఛనంగా జరిగింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సమక్షంలో శనివారం ఎన్నిక జరిగింది. వాస్తవానికి 2021 డిసెంబర్లోనే భారత ఒలింపిక్ సంఘం ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే ఐఓఏను సస్పెండ్…