College Fee Tragedy: పేద వారికి ఆర్థిక కష్టాలు రోజూ తోడుగా ఉంటాయి. తిండికి డబ్బు లేదు. చదువుకు అయ్యే ఖర్చును అందించాలనుకున్నా విలాసమే.. ఓ వ్యక్తి తన కుమార్తె కాలేజీకి డబ్బులు జమ చేయలేక మనోవేదనకు గురయ్యాడు. దీంతో అతడు ఆత్మహత్యను ఎంచుకున్నాడు. గుజరాత్‌లోని తాపీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బకుల్ పటేల్ గుజరాత్‌లోని తపిర్ గొద్దా గ్రామంలో చాలా కాలంగా నివాసం ఉంటున్నాడు. కార్లు రిపేరు చేస్తూ రోజులు గడుపుతున్నాడు. బకుల్ తన కుమార్తె కాలేజీకి ఫీజు కట్టలేకపోయాడు. కారణం కరోనా తర్వాత వ్యక్తి ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని దాంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సీఎం జడేజా పేర్కొన్నారు.
Read Also: Bundles of Notes Found At Begger: బాబోయ్ నోట్ల కట్టలు.. బిచ్చగాడి వద్ద డబ్బులే డబ్బులు
ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు మొదలైంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓ ట్వీట్‌లో నిందించారు. చదువు కొన లేక మరొక ప్రాణం బలైందని.. ఈ అంశాన్ని బీజేపీ పరిశీలించాలి. ప్రతిభ ఉన్నా పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సంఘటన నిజంగా సిగ్గుచేటన్నారు. అయితే, ఆప్ నాయకుడి మాటలను స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మోహన్ ధోడియా ఖండించారు. తనకు బకుల్ వ్యక్తిగతంగా తెలుసు. కారు బాగుచేయాలని చాలాసార్లు ఇంటికి పిలిచాడని… డబ్బు సమస్య గురించి అతడు ఎప్పుడూ అనలేదని.. ఆత్మహత్య వెనుక ఉన్న కారణాన్ని తెలుకునేందుకు దర్యాప్తు జరిపిస్తామని బదులిచ్చారు.