Rahul Gandhi blamed AAP for Congress' defeat in Gujarat elections: గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి తొలిసారి స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజస్థాన్ లో భారత్ జోడో యాత్రలో ఉన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కారణం అని నిందించారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, బీజేపీ పార్టీకి బీ-టీమ్ గా వ్యవహరించిందని దుయ్యబట్టారు.
BJP leader warning on Pathaan movie: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొత్త సినిమా ‘పఠాన్’ వివాదాస్పదం అవుతోంది. సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ మొదత్తం రచ్చకు కారణం అయింది. సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న దీపికా పదుకొణె ఈ పాటలో కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించడం ప్రస్తుతం మొత్తం వివాదానికి కారణం అయింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పాట ఉందని బీజేపీతో సహా పలు హిందూ గ్రూపులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో వంద రోజలు పూర్తి చేసుకోనుంది.
దేశ రాజధాని ఢిల్లీలో BRS ఆఫీసు ప్రారంభించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు గులాబీ దళపతి, సీఎం కేసీఆర్. అబ్కీ బార్.. కిసాన్ సర్కార్ అనే నినాదంతో పాగా వేయడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పొలిటికల్ స్పేస్ ఉన్న రాష్ట్రాలపై కేసీఆర్ నజర్ ఉంది. ఆ విధంగా తెలుగు రాష్ట్రమైన ఏపీపైనా ఆరా తీస్తున్నారట. ఇప్పటికే BRS విస్తరణ దిశగా చర్యలూ మొదలైనట్టు తెలుస్తోంది. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి బయలుదేరిన జేపీ నడ్డా సాంకేతిక లోపంతో కర్ణాటకలోని విద్యానగర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అయ్యారు. మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్‌కు జేపీ నడ్డా చేరుకోవాల్సింది. కానీ విమానంలో సాంకేతిక లోపంతో ఆలస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కరీంనగర్ సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ 5వ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కరీంనగర్ బీజేపీ అడ్డా అని.. బండి సంజయ్ అడ్డా అంటూ ఆయన అన్నారు.