Protestors disrupt Shah Rukh Khan’s film shoot in Jabalpur, chant Hanuman Chalisa: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్’ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో షారుఖ్ ఖాన్ షూటింగ్ ను అడ్డుకున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతం అయిన భేదాఘాట్ లో షారూఖ్ సినిమా షూటింగ్ నడుస్తోంది.
అయితే ఈ షూటింగ్ గురించి తెలిసిన వెంటనే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు భేదాఘాట్‌కు చేరుకున్నారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడే గంటల తరబడి నిలబడి, హనుమాన్ చాలీసా పఠించారు. నర్మదా నదీ తీరంలోని తపోభూమిలో హిందువులను అవమానించే ఏ నటుడి సినిమాను అనుమతించబోం అని హిందూ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. అయితే షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్ తో పాటు కీలక నటీనటులు అక్కడ లేరు.
Read Also: FIFA World Cup Final: తుదిపోరుకు ముందే డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌కు భారీ షాక్
బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణే కాషాయ రంగులో ఉన్న బికనీ ధరించడంతో ఈ వివాదం మొదలైంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని రాజకీయ నాయకులు ఈ పాటను తొలగించకుంటే సినిమాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిషేధిస్తామని హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా వార్నింగ్ ఇచ్చారు. ఇదే విధంగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ కూడా సినిమాలో అభ్యంతకరమైన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం తొలిసారి కలిసి పఠాన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 25, 2023లో విడుదల చేయనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ రా ఫీల్డ్ ఏజెంట్ పఠాన్ గా కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా డబ్బింగ్ కానుంది.