Sanjay Raut comments on Rahul Gandhi and BJP: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నాయకత్వానికి గతేడాది కొత్త ఊపు వచ్చిందని.. ఇది 2023లో కూడా ఇదే విధంగా కొనసాగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో రాజకీయ మార్పును చూడవచ్చని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ ఆదివారం పేర్కొన్నారు. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రోఖ్థోక్ కాలంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి…
Rahul Gandhi said BJP is his guru: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. తనకు బీజేపీనే రోడ్ మ్యాప్ చూపిస్తుందని.. ఎప్పటికీ చేయకూడని వాటిని నేర్పుతోందని శనివారం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీనే నా గురువు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాపై దూకుడుగా దాడి చేయాలని కోరుకుంటోందని.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని.. నేను బీజేపీని గురువుగా భావిస్తాను..…
కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. అందులో ఉన్న పొరపాట్లను అధిష్టానానికి ఎత్తిచూపుతూ వచ్చిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాంనబీ ఆజాద్.. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్రమంలో గులాంనబీ మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరనున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన…
Bandi Sanjay: తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.
ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారని ఆరోపించారు.
BJP MP Pragya Thakur Named In Police Case For "Hindus, Keep Knives" Speech: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్(సాధ్వి ప్రజ్ఞా) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక శివమొగ్గలో రెచ్చగొట్టే ప్రకటన చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంత సదస్సులో మాట్లాడుతూ.. ముస్లింలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఈ భోపాల్ ఎంపీపై ఫిర్యాదు నమోదైంది. ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.