ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంటోంది. అందునా శివరాత్రి వేళ ఒక పోస్టర్ వివాదం రెండు పార్టీ నేతల మధ్య వైరాన్ని మరింత రాజేసింది. తాజాగా దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని రాజకీయంగా వాడుకుంటూ బిజెపి పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి మెట్టు సత్యనారాయణ అన్నారు. శ్రీశైలం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అయన మీడియాతో మాట్లాడారు.
హిందూత్వం గురించి గానీ హిందూ దేవుళ్ళ గురించి గానీ బిజెపి నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపారు. చంద్రబాబునాయుడు హయాంలో చంద్రబాబు క్యాబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రి పనిచేసిన బిజెపి నేతలు 40 గుళ్ళని అన్యాయంగా, అక్రమంగా కూల్చి వేస్తే హిందూత్వం ఏమైపోయిందని ప్రశ్నించారు. నెల రోజుల ముందు నుండి శివాలయాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా జరగాల్సిన కార్యక్రమాల పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ సంవత్సరం శివరాత్రి మహోత్సవాల్లో ఎక్కడా కూడా చిన్న సమస్య లేకుండా సంతోషంగా ఘనంగా జరుపుకున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓచిన్న పిల్లవాడికి పాలుపట్టిస్తున్న దృశ్యాన్ని రాజకీయం చేయడం ఎంత దుర్మార్గం అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడంలో హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి అన్నారు.
Read Also: Liver Health: ఈ లక్షణాలు ఉంటే.. మీకు లివర్‌లో సమస్యలు ఉన్నట్లే..