Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తొలగిస్తూ ఇటీవల అగ్రనాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేసింది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఆయనను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
Uddhav Thackeray: మహరాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో శివసేన అంశంపై రాజకీయాలు నడుస్తుంటే.. తాజాగా ఎన్సీపీలో చీలిక తాజా అంశంగా మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తాడు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం వరంగల్లో పర్యటించనున్నారు. రేపు పీఎం మోడీ వరంగల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వరంగల్ కు బయలుదేరారు. ఇవాల ఉదయం కిషన్ రెడ్డి తన నివాసంలో పూజలు చేసిన అనంతరం వరంగల్ బయలు దేరారు.
జూలై18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.
8 న వరంగల్ కి ప్రధాని మోడీ వస్తున్నారని, రైల్వే శాఖకు సంబంధించి వాగన్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన చేస్తారన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2,400 వ్యాగన్ ల తయారీ.. మొదటి దశలో 521 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతినీ ప్రశ్నించకుండ ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ మానవ హక్కులు కమిషన్ కమిషనర్ లేకుండా చేశారంటూ ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ తీసుకు వచ్చి మా చారిటీ భూములను ఆగం చేశారు.. నన్ను తిట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయన్ ట్రాన్స్ ఫర్ అయ్యాడు అంటూ ఆయన వ్యాఖ్యనించాడు.
జులై 8న తెలంగాణ రాష్ట్రం వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.ఈ సందర్భంగా రూ. 6,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. గౌడవెల్లి గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు 15 యూనిట్ల గొర్రెపిల్లలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేసారు.