Komatireddy: వారమే డెడ్ లైన్.. లేదంటే ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం.. కేసీఆర్ కు కోమటి రెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy: తెలంగాణ సీఎం కేసీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. డీఎస్సీ నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య అసెంబ్లీలో ప్రకటించిన ప్రకారం 13500 పోస్టులకు నోటిఫికేషన్ పునరుద్ధరించుట గురించి వారం రోజుల్లో ప్రకటన చేయాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. లక్షల మంది నిరుద్యోగుల అవస్థల గురించి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోంది? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయి? కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అక్కడే వదిలేశారని మండిపడ్డారు. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కొలువుల సంగతి సరేసరి. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని..? భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? అదిగో ఇదిగో అంటూ నిరుద్యోగుల్ని ఊరించి వారిని నిండా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. ఓవైపు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిల్లో కొందరి వయో పరిమితి కూడా దాటిపోతోందని, అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? అని ప్రశ్నించారు.
Read also: PM Modi: మోదీకి అనుకూలంగా 80 శాతం భారతీయులు.. ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడి
Also Read
సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? 2020 డిసెంబర్ లో అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారని అన్నారు.ఎంతో ఆర్భాటంగా 13500 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.. తీరా మీరు ప్రకటించిన డిఎస్సిలో మాత్రం 5000 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగనే లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో 6 నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేవారని గుర్తు చేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్ల కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తోందని కానీ.. ఇప్పుడు మీరు ప్రకటించిన నోటిఫికేషన్ లో ఇచ్చిన పోస్టులు జిల్లాకు 10 కూడా రాలేని పరిస్థితి ఉందని అన్నారు. 13,500 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఉన్నత విద్యామండలి ముట్టడికి ప్రయత్నిస్తే.. మహిళలు అని చూడకుండా విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది వారిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి నిరుద్యోగుల బాధలను గుర్తించాలని కోరారు. ఎంతో వ్యయప్రయాసలు కోర్చి కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అవుతున్న వారి ఆశలపై నీళ్లు చల్లకండని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన విధంగా 13,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వారం రోజుల్లో పునరుద్ధరించాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్షలమంది నిరుద్యోగులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామన్నారు.
Pawan Kalyan : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్
తాజావార్తలు
-
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
-
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
-
LK.Advani: ఎల్కే.అద్వానీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
TDP Candidates 1st List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ తొలి జాబితా.. 61 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు
ట్రెండింగ్
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!