నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు దినేష్. ఈ కార్యక్రమంలో ఎంపీ అర్వింద్, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. హిందూ మతానికి చేసిన పాపాల వల్లే.. కాంగ్రెస్ పార్టీకి అయోధ్య రామయ్యను చూసే భాగ్యం దక్కలేదని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యకు రాముడొచ్చాడు.. త్వరలో మథురలో శ్రీకృష్ణుడు మందిరంలోకి వస్తారని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బులు పంచకుండా గెలుస్తామని…
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దోపిడి దొంగల పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ అగ్గి…
Breaking News: ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ నిష్క్రమించే అవకాశం ఉందని బీహార్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో పాటు బీహార్ మహఘటబంధన్ కూటమి నుంచి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో పొత్తును ఉపసంహరించుకోనున్నట్లు తెలుస్తోంది. పాత మిత్రుడు బీజేపీతో జట్టు కట్టే అవకాశం ఉన్నట్లు పలు వర్గాలు వెల్లడించాయి.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ అస్సాంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇరు నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రలో ఉద్రిక్తతల నేపథ్యంలో రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు.
బాల రాముని ప్రాణ ప్రతిష్ట ప్రపంచం మొత్తం వీక్షించిందన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర దేశాలలో నుండి కూడా మట్టి,నీరు బట్టలు ఈ బాలరాముని ప్రాణ ప్రతిష్ట కు పంపించారన్నారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆత్మగౌరవ ఈవెంట్‌గా జరిగిందన్నారు. తెలంగాణా ప్రభుత్వం అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే పట్టనట్టు నడుచుకున్నారన్నారు. తెలంగాణాలోని ప్రధాన దేవాలయాల నుండి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి.. కానీ అవేవీ లేకుండా ఈ ఎండోమెంట్…
దొంగ ఓట్లతో గెలవాలని జగన్ కుట్రలు చేస్తున్నారని.. ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి తెలిపారు. బీజేపీ సోషల్ మీడియా విభాగంతో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై పురంధేశ్వరి దిశా నిర్దేశం చేశారు.
రాహుల్ గాంధీతో పాటు భారత్ జోడో న్యాయ యాత్రకు భద్రత కల్పించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.