కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఆదివారం రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమిత్ షా పర్యటన రద్దు విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రేపు తెలంగాణలో పర్యటించాల్సిన కార్యక్రమం ఉండినది. కానీ కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా పడిందన్నారు. దీంతో కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేశామని పేర్కొన్నారు.
Read Also: Driverless Train: దేశంలో తొలి డ్రెవర్ లెస్ మెట్రో రైల్.. బెంగళూర్‌లో ప్రారంభం..
కాగా.. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే అగ్రనేత అమిత్ షా పర్యటన జరగాల్సి ఉండేది. ఈ పర్యటనలో మూడు జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ను సిద్ధం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీ.. 8 సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకోగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగింది. ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది బీజేపీ.
Read Also: Harish Rao: మరో 4లక్షల ఓట్లు వచ్చి ఉంటే మన ప్రభుత్వమే ఉండేది..!