Swami Paripoornananda: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న కొద్ది.. ఆశావహులు తాము పోటీ చేయదల్చిన స్థానాలను బయటపెడుతున్నారు.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు స్థానాలకు ఇంఛార్జ్‌లను ఖరారు చేసింది.. పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి ఇచ్చింది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది.. మరోవైపు.. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే హిందూపురం నుంచి నేను పోటీకి రెడీ.. తనను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని ఆదేశిస్తే పోటీ చేస్తాను అని ప్రకటించారు శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీపరిపూర్ణానంద స్వామి.. హిందూపురంలో ఉన్న పరిచయాలతో నా భావాలను అధిష్టానానికి తెలిపాను. ఇక్కడ వారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కోరడంతో హిందూపురంలో అందర్నీ కలుస్తున్నాను అని వెల్లడించారు. ఇక, నాకు అభ్యర్థిగా అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను.. హిందూపురంలో అభివృద్ధి దిశగా, పురాతన కట్టడాల పరిరక్షణకు మాన్యాల పరిరక్షణకు తోడ్పాటు అందిస్తాను అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్టానానికి కూడా తెలియజేయనున్నట్ట పేర్కొన్నారు శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీపరిపూర్ణానంద స్వామి.
Read Also: INDIA bloc: యూపీలో 11 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకారం.. కాంగ్రెస్ అసంతృప్తి..