తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి, వైసీపీ నేతలు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్గంజ్ ఎంపీ టికెట్ ను ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ కు బీజేపీ కేటాయించింది. దీంతో శుక్రవారం నాడు కరణ్ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంగా ఆయన తన అనుచరగణంతో హల్ చల్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి, గుణ బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది.
KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం వెంకంపేట చౌరస్తాలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచిందన్నారు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్వరలో తాళం వేసి.. ఆయన హైదరాబాద్ కు జంప్ అవుతారని వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చెప్పుకొచ్చారు. అలాగే, బీజేపీలో తెలుగుదేశాన్ని కూడా విలీనం చేస్తారన్నారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి హత్య బెదిరింపులు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ హయాంలోని భజన్లాల్ శర్మ కేబినెట్లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న బాబులాల్ ఖరాడీని చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు.