ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు తనకు తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు.
ఆరులో ఐదు గ్యారెంటీలు పూర్తి చేశామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధనిక రాష్ట్రం తెలంగాణాను Brs ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ వచ్చాక చిప్ప చేతికి ఇచ్చిందని ఆరోపించారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు ఏపీపై ఫోకస్ పెట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌లకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేక ఉండే బీజేపీ బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగేహక్కు లేదని అన్నారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని తెలిపారు. తాము మండల కమిషన్ అమలు…
Arvinder Singh Lovely: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కి భారీ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అరవిందర్ సింగ్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.."బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు.
Rahul Gandhi: రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు క్లోజర్ రిపోర్టును ఇచ్చారు. హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న రోహిత్ వేముల మృతిపై తెలంగాణ పోలీసులు విచారణ ముగించారు.
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీ. కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు.. నిన్న పోలీసులు క్లోజర్ రిపోర్ట్ ఇస్తూ.. రోహిత్ దళితుడే కాదని చెబుతోందని పేర్కొన్నారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు.