AIADMK: ఎంపీ ఎన్నికల్లో తమిళనాడు రూలింగ్ పార్టీ డీఎంకే మరోసారి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది. అయితే, ఆ పార్టీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరిగింది.
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ దారుణ ప్రదర్శనకు తాను బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చెప్పారు. అయితే, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకత్వం వారించడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు.
ఈ నేపథ్యంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఉన్న కీలకమైన మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి రెండు కేబినెట్ బెర్తుల్ని కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ 9న వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో పదవుల కోసం రాష్ట్ర బీజేపీలో తీవ్ర లాబీయింగ్ మొదలైనట్లు సమాచారం. రాష్ట్రంలోని ఎనిమిది లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది మరియు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి చాలా మంది ఎంపీలు లాబీయింగ్ ప్రారంభించినట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపీలకు ప్రధాని మోడీ కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఎంపీకి కేబినెట్ హోదాలో,…
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు.
Loksabha Elections 2024 : దేశంలో లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార పోరు మొదలైంది. ఈసారి బీజేపీ, ఇండియా కూటమి ఏదీ మెజారిటీ మార్కును దాటలేకపోయింది.
PM Modi: 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
Devendra Fadnavis: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దారుణ ఫలితాలు తెచ్చుకుంది. 48 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ 09 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీయే కూటమి మొత్తంగా 17 స్థానాలను గెలుచుకుంది.
PM Modi: ఎన్డీయే పక్ష నేత ప్రధాని నరేంద్రమోడీని ఎన్నుకున్నారు. చంద్రబాబు నాయుడి టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ, షిండే శివసేన పార్టీలు ఏకగ్రీవంగా ప్రధాని మోడీకి మద్దతు తెలిపాయి. ఎన్డీయే పార్టమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన తర్వాత ప్రధాని ఎన్నికైన ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు.
Congress: లోక్సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2014, 2019లో స్వయంగా మెజారిటీ మార్క్(272) సీట్లకు పైగా బీజేపీ గెలుచుకుంటే,