BJP: వరసగా మూడోసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రధానిగా మరోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి ఆరు మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల కోడ్ పేరుతో ముఖ్యమంత్రి హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్‌గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
Uddhav Thackeray: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న మహారాష్ట్రలో అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో బీజేపీ కేవలం 09 స్థానాలు, దాని మిత్రపక్షాలైన శివసేన(షిండే) 07, ఎన్సీపీ(అజిత్ పవార్) 01 స్థానాలను మాత్రమే సాధించాయి.
ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో రికార్డు సృష్టించింది. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీఏ నేతలతో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర…
విజయవాడలో ఎన్డీయే శాసనసభాపక్ష సైతం జరిగింది. ఇందులో శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరింది. ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికోసం అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి మెజారిటీ లేకపోవడంతో భాగస్వామ్య పక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. స్పీకర్ పదవి భాజపాకు దక్కుతుందా, మిత్రులకు ఇస్తారా అనేది చర్చనీయాంశం. ప్రొటెమ్ స్పీకర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ లేదా భాజపా సీనియర్ నేత వీరేంద్ర కుమార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్‌గా పురందేశ్వరి లేదా ఓం బిర్లా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరిన్ని వివరాలు…
PM Narendra Modi Portfolios: దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఆదివారం (జూన్ 9) సాయంత్రం ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.. 2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. మోడీ 3.0 సర్కార్ కొలువుల్లో కీలక పదవులు మళ్లీ బీజేపీ సీనియర్ నేతలనే వరించాయి. ఇక ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు తగిన రీతిలో శాఖలను కేటాయించారు.…
MP Suresh Gopi : దేశంలో కొత్త ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు.