Ajit Pawar: రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్..
- రాజ్యసభ బరిలో అజిత్ పవార్ భార్య..
- నామినేషన్ దాఖలు చేసిన సునేత్రా పవార్..
- బారామతి నుంచి ఓడిపోయిన సునేత్రా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ రాజ్యసభ బరిలో నిలిచారు. ఇటీవల మహారాష్ట్రలోని బారామతిలో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకి ప్రత్యర్థిగా నిలబడిన సునేత్రా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు రాజ్యసభ దారి ఎంచుకున్నారు. గురవారం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఎన్సీపీ అభ్యర్థిగా పత్రాలను దాఖలు చేశారు. ‘‘రాజ్యసభ ఎన్నికలకు సునేత్ర పవార్‌ను పోటీకి దింపాలని ఎన్సీపీ నిర్ణయించింది. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నాను, కానీ బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ఆమె పేరును ఖరారు చేశారు’’ అని రాష్ట్ర మంత్రి , సీనియర్ ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్ చెప్పారు.
Read Also: Bihar: విరిగిన కాలుకు ప్లాస్టర్ బదులుగా అట్టపెట్టె.. ఇదేం వైద్యం రా.. బాబు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
పార్టీ నిర్ణయాన్ని అంతా అంగీకరించాలి. కొన్ని నిర్భందాలు ఉన్నాయని నేను స్వతంత్రుడిని కాదని, పార్టీ నాయకుడిని, కార్యకర్తనని ఛగన్ భుజ్‌బల్ అన్నారు. రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయనందుకు నిరాశ చెందారా..? అని ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇలా అన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ సభలో 10 ఖాళీలను నోటిఫై చేసింది. ఇందులో అస్సాం, బీహార్, మహారాష్ట్రలో రెండు స్థానాల చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపురలో ఒక్కొక్కటి ఉన్నాయి.
ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దారుణంగా దెబ్బతింది. మొత్తం 48 ఎంపీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో కేవలం 17 స్థానాలను మాత్రమే గెలిచింది. ఇందులో బీజేపీ 09, శివనేన షిండే 07, ఎన్సీపీ అజిత్ పవార్ 01 సీట్లను గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి మాత్రం ఏకంగా 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ 13, శివసేన (ఉద్ధవ్) 09, ఎన్సీపీ శరద్ పవార్ 08 సీట్లను గెలుచుకున్నారు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!