RSS: అహంకారులను రాముడు 241 వద్దే ఆపాడు..బీజేపీపై ఆర్ఎస్ఎస్ నేత ఫైర్..
- బీజేపీపై ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు..
- అహంకారులను 241 వద్ద రాముడు ఆపాడు..
- బీజేపీ సీట్లను ఉద్దేశించి ఇంద్రేష్ కుమార్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. 543 సీట్లున్న లోక్‌సభలో మెజారిటీ 272 సీట్లు కాగా, కమలానికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, శివసేనలపై ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంగా ఎన్డీయే కూటమికి 293 సీట్లు వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ సహకరించకపోవడంతోనే సీట్లు తగ్గాయనే వాదన నడుస్తోంది.
Read Also: Viral Video : రెచ్చిపోయి టోల్ సిబ్బందిని కొట్టిన ఇన్‌స్పెక్టర్.. వీడియో వైరల్
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ఇదిలా ఉంటే, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల బీజేపీ పేలవమైన పనితీరుకు ‘‘అహంకారమే’’ కారణమని అన్నారు. జైపూర్ సమీపంలోని కనోటాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రామభక్తితో మెలగేవారు క్రమంగా అహంకారులుగా మారారు. అయితే, అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, అహంకారం కారణంగా రాముడు 241 వద్దే ఆపాడు’’ అని అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 241 సీట్లు మాత్రమే గెలుచుకుంది. మెజారిటీ మార్కును దాటలేకపోయిందని ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. 2014, 2019లో స్వయంగా మెజారిటీ సాధించిన బీజేపీ ఈ సారి మాత్రం మెజారిటీ మార్కుకు దూరంగా ఆగిపోయారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిని ‘‘రాముడికి వ్యతిరేకం’’గా అభివర్ణించారు. రాముడిపై విశ్వాసం లేని వారిని ఏకంగా 234 వద్ద నిలిపివేశారు. దేవుడి న్యాయం నిజం, ఆనందదాయకం అని అన్నారు. ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని 20కి పైగా పార్టీలన్నీ కలిసి 234 సీట్లు సాధించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రజాసేవలో వినయం యొక్క ప్రాముఖ్యతను బోధించిన కొద్ది రోజుల తర్వాత ఇంద్రేష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!