ఆంధ్రప్రదేశ్లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Siddipet: దుబ్బాక రఘునందన్ రావు అడ్డా.. సిద్దిపేట హరీష్ రావు గడ్డ.. దుబ్బాకలో ఏ పార్టీవారు వచ్చిన రఘునందన్ రావుకు సహించరు. అలాగే సిద్ధిపేటకు ఎవరొచ్చినా హరీష్ రావుకు నచ్చదు.
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సాకేత్ గోఖలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు బీజేపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు.. త్వరలో లోక్సభలో బీజేపీ బలం 237కి తగ్గుతుందని ఆయన తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు మంగళవారం (జూన్ 11) 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనా 6.6%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. వస్తు తయారీ, రియల్ ఎస్టేట్లో మరింత వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.6…
Congress: తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకేపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో డీఎంకేపై కాంగ్రెస్ ఎంతకాలం ఆధారపడుతుందని టీఎన్ పీసీసీ చీఫ్ సెల్వపెరుంతగై ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.
Odisha Swearing-In: ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఇప్పటికే కొత్త ముఖ్యమంత్రి పేరు ఖారరైంది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.