KTR: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో వున్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శుక్రవారం కవితను మర్యాదపూర్వకంగా కలిసారు.
Maharashtra: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయేలో భాగంగా ఉన్న బీజేపీ, ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పొత్తుకు బీటలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమి కన్నా ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఒక్కసారిగా బీజేపీ, ఎన్సీపీ మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి.
RSS: బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వరసగా ఆ పార్టీపై విమర్శలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. 543 సీట్లున్న లోక్‌సభలో మెజారిటీ 272 సీట్లు కాగా, కమలానికి 240 సీట్లు మాత్రమే వచ్చాయి.
హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ సిబ్బంది నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పాల్గొన్నారు. రాయ్ , బండి సంజయ్ కూడా కౌగిలించుకున్నారు. ఈ కార్యక్రమానికి హంపి మఠం శ్రీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విద్యారణ్య భారతి స్వామీజీ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ,…
అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పులో మరోసారి తన మార్కుని ప్రదర్శించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ మంత్రివర్గంలో మొత్తం 24 మంత్రి స్థానాలకు ఏకంగా 17 మందిని కొత్తవారికి అవకాశం ఇచ్చారు. జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చిన మిగిలినవి టీడీపీ వారికీ కట్టబెట్టారు. అయితే మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనుకున్న సీనియర్ నాయకులకు చేదు అనుభవం ఎదురయ్యింది. కన్ఫర్మ్ సీట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళ అందరకి ఈ సరి బెర్త్ దక్కలేదు.…