Maharashtra: బీజేపీ, షిండే వర్గం మధ్య వార్.. గత ఎన్నికల్లో బీజేపీ జోక్యంపై శివసేన సీనియర్ నేత ఫైర్
- లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపిణీ విషయంలో బీజేపీ జోక్యం చేసుకుంది
- లేదంటే 15 సీట్లు సాధించే వాళ్లం
- అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసి 90 సీట్లు గెలుస్తాం
- శివసేన 58వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాందాస్ కదమ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే నేతృత్వంలోని మహాయుతి కూటమిలో సీట్ల పంపకంపై టగ్ ఆఫ్ వార్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల విషయంలో మిత్రపక్షాలైన బీజేపీ, అజిత్ పవార్‌ను శివసేన (షిండే వర్గం) సీనియర్ నాయకుడు రాందాస్ కదమ్ లక్ష్యంగా చేసుకున్నారు. శివసేన 58వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్నికలకు 2 నెలల ముందు శివసేన (షిండే వర్గం) లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తే మొత్తం 15 స్థానాల్లో విజయం సాధించి ఉండేవాళ్లమని అన్నారు. తాము అభ్యర్థులను ప్రకటించినప్పుడు, బీజేపీ మళ్లీ రంగంలోకి దిగి ఆ స్థానాలపై తన హక్కును చాటుకుందన్నారు.
READ MORE: Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
అప్పటికే బీజేపీ జోక్యాన్ని ఆపాలని ఏక్‌నాథ్ షిండేను అభ్యర్థించానని, అదే జరిగి ఉంటే నాసిక్‌లో హేమంత్ గాడ్సే, యవత్మాల్ నుంచి భావన గావ్లీ, హింగోలి నుంచి హేమంత్ పాటిల్ గెలిచి పార్లమెంటుకు చేరుకునేవారని ఆయన అన్నారు. అజిత్ పవార్ ప్రవేశం ఆలస్యమై ఉంటే బాగుండేదని రాందాస్ కదమ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తామని రాందాస్ కదమ్ చెప్పారు. 100 స్థానాల్లో పోటీ చేస్తే 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ వర్గానికి ఈ సారి కచ్చితంగా 100 సీట్లు కావాలని సీఎం షిండేను రాందాస్ కదమ్ అభ్యర్థించారు.
READ MORE: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్‌లపై కేంద్రమంత్రి..
మరోవైపు, అజిత్ పవార్ సకాలంలో రావడం వల్ల షిండే శిబిరం ప్రాణాలను కాపాడిందని, లేకుంటే లొంగిపోయేదని అజిత్ పవార్ క్యాంపు అధికార ప్రతినిధి అమోల్ మిత్కారీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఇదిలావుండగా, ఎవరైనా సరే ఎన్ని సీట్లు కావాలన్నా అడగవచ్చని బీజేపీ నేత, కేబినెట్ మంత్రి గిరీష్ మహాజన్ స్పష్టం చేశారు. అయితే సీనియర్ నాయకత్వం అంతా కలిసి కూర్చుని తుది నిర్ణయం తీసుకోనుందన్నారు. అదే సమయంలో సీట్ల కేటాయింపు విషయంలో ఏకనాథ్ షిండే వర్గం చేస్తున్న డిమాండ్లపై ఉద్ధవ్ వర్గం మండిపడుతోంది. ఉద్ధవ్ వర్గం అధికార ప్రతినిధి ఆనంద్ దూబే వ్యంగంగా మాట్లాడారు.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!