ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. ఆప్, బీజేపీల మధ్య చోటుచేసుకుంటున్న ఆరోపణలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఢిల్లీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె పీఏ రూ. 5 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ తెలిపారు. అతిశీ పీఏ గిరిఖండ్ నగర్ లో రూ. 5 లక్షలతో పోలీసులకు చిక్కాడంటూ బాంబ్ పేల్చాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించాడు.
కల్కాజీలోని ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు పంచేందుకు కుట్ర జరుగుతోందని మాలవీయ తెలిపారు. కాగా ఆతిశీ ఆ నియోజక వర్గం నుంచే పోటీచేస్తుండడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. ఢిల్లీలోని 70 స్థానాలకు మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.