యూపీ ఉపఎన్నికల్లో విజయం సాధించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. గబంధన్‌లో దాని మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డి మరో స్థానాన్ని గెలుచుకుంది. ఎస్పీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కుందర్కి సీటులో బీజేపీ అతిపెద్ద విజయం సాధించింది. ఈ విజయంతో బీజేపీ 31 ఏళ్ల రాజకీయ కరువుకు తెరపడింది.
దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3 లోక్ సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. తాజాగా ఆదివారం రోజు ఓట్లను లెక్కించారు. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. త్రిపురలో అగర్తల, జుబరాజ్ నగర్, సుర్మా, బర్డోవాలి( పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గాలకు, జార్ఖండ్ లోని మందార్, ఢిల్లీలోని రాజిందర్ నగర్, ఏపీలోని ఆత్మకూర్ అసెంబ్లీ నియోజవర్గాలతో పాటు పంజాబ్ లోని సంగ్రూర్ లోక్ సభ, ఉత్తర్…