Bandi Sanjay : స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు గట్టిగా ఓడించేందుకు ఎదురు చూస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జడ్పీటీసీ ప్రభారీలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని, సిరిసిల్ల జడ్పీ పీఠం కూడా ఈసారి…
Ram Chandra Rao: తెలంగాణ రాష్టంలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. రాష్టంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీ బలహీనంగా లేదని, బలంగా ఉందని.. రానున్న స్థానిక ఎన్నికల్లో నెం.1గా నిలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రామచందర్ రావు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై అధికార పార్టీపై విమర్శలు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే…
Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బీజేపీ క్రమంగా ఎదుగుతోందని, ఒకప్పుడు గ్రామాల్లో ఒకటి రెండు ఓట్లు వచ్చిన చోట ఇప్పుడు వందల సంఖ్యలో ఓట్లు వస్తున్నాయని రామచందర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని గుర్తించారని, గెలుపు చూస్తున్నామని తెలిపారు. Uttarpradesh: కారు ఇంజన్ లో పైథాన్.. లగెత్తరో…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
Minister Seethakka: యూరియా కొరత పై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి సీతక్క అన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపై ధర్నా చేయిస్తున్నారని విమర్శించారు. నేడు కామారెడ్డిలో పర్యటించిన ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందడంతో ఈ ఖాళీ ఏర్పడింది.
Guvvala Balaraju : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఆయన వచ్చే ఆదివారం (10వ తేదీ) ఉదయం 10 గంటలకు బీజేపీ పార్టీని చేరనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించిన బాలరాజు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, నేను ఎంతో కష్టపడి బీఆర్ఎస్ పార్టీ జెండాను చెట్టు కు, పుట్టకు, ఇంటికి తీసుకెళ్లాను.…
Ramchander Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తాం. ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా? లేక కాంగ్రెస్‌దా?” అని ఆయన…
Ramchander Rao : మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా…