Ramchander Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణ కమిషన్ నివేదిక హాట్ టాపిక్‌గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతున్న వేళ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ అంశంపై స్పందించారు. నివేదిక లీకులపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే మేము స్పందిస్తాం. ఇప్పుడే బయటకు వస్తున్న ఈ నివేదిక ప్రభుత్వానిదా? లేక కాంగ్రెస్‌దా?” అని ఆయన…
Ramchander Rao : మోడీని కూడా కన్వర్టెడ్ బీసీ అని విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కన్వర్ట్ అయ్యారు.. మోడీ కాదు అని ఆయన విమర్శించారు. కేసీఆర్ గతంలో ఎంబీసీ చైర్మన్ పెట్టి రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కేసీఆర్.. సమగ్ర కుల సర్వే చేశాడు.. కానీ నివేదిక బయటపెట్టలేదన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతానికి పైగా…
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు,…
DK Aruna: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అనేక అంశాలపై తనదైన శైలిలో వివరించారు. తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ – కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాల అసలైన రూపం బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ‘హైడ్ అండ్ సీక్’ రాజకీయ నాటకం కొనసాగుతోందని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్, వ్యక్తిగత నిఘా, గోప్యత ఉల్లంఘనలపై రేవంత్ రెడ్డి…
Ponnam Prabhakar : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అసాధ్యం అనడం బీజేపీ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందlr పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో ఇదే విధమైన రిజర్వేషన్లు అమలు అయ్యాయి. సుప్రీంకోర్టు ఇందిరా సహనీ కేసులో స్పష్టంగా చెప్పింది – రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ప్రమాణితమైన సమాచారం, ఎంపెరికల్ డేటా ఉంటే వారు రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవచ్చని” అన్నారు. “ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసింది,…
BJP Chief Ramchander Rao : ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీకి పునర్వైభవం తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో కూడా బలంగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇప్పటివరకు 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని, బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదన్న ఆరోపణలు కావాలని చేస్తున్నారని రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసపు హామీలతో అధికారంలోకి వచ్చి, ఆరు గ్యారెంటీలను అమలు…
Raja Singh : గోషామహాల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు గెలిచిన రాజాసింగ్ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను ఆవేదనతో వెల్లడించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం తన రాజీనామా వెనుక ఉన్న భావోద్వేగాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. “నన్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీకి కృతజ్ఞతలు. కార్యకర్తగా 11 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరాను. గోషామహాల్ నుంచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి గోషామహాల్ ప్రజల సంక్షేమం కోసం, హిందుత్వ బలోపేతం…
Mallu Bhatti Vikramarka: ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 2017లో హైదరాబాద్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని కుదిపేసిందని గుర్తు చేస్తూ.. ఆ ఘటన వెనుక ఉన్న అసలు బాధ్యులను దేశ ప్రజలముందు నిలబడే చర్యనే అతి పెద్ద ప్రశ్నగా ఆయన అభివర్ణించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2017 లో రోహిత్ వేముల ఆత్మహత్య దేశాన్ని షేక్ చేసింది. సూసైడ్ లేఖలో రోహిత్…
MLA Rajasingh: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామాను తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి సంబంధించిన విషయంలో నొచ్చుకున్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ సమయంలో రాజాసింగ్ తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. లేఖను స్పీకర్ కు పంపించాలని కూడా సూచించారు. Read Also:Asia Cup 2025: ఆసియా కప్…
Ramchander Rao: సైకోట్రోపిక్ కల్లు ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ కల్లు కాంపౌండ్ లో కల్లులో సైకో ట్రోఫిక్ సబ్స్టెన్స్ కలపడం వల్ల అనధికారికంగా 6 మంది మృతి చెందారని, పలువురి ఆరోగ్యం విషమించిందని ఆయన తెలిపారు. రెండు సీసాల కల్లు తాగినవారిలో కిడ్నీలు దెబ్బతిన్నాయనడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఒకే ఆసుపత్రిలో 31 మందికి చికిత్స జరుగుతోందని, బాధితుల పరిస్థితి…