H3N8 Bird Flu: మానవుల్లో అత్యంత అరుదుగా కనిపించే బర్డ్ ఫ్లూతో చైనాలో ఒకరు మరణించారు. ప్రపంచంలోనే ఇలా మరణించడం ఇదే మొదటిసారి. అయితే ప్రజల నుంచి ప్రజలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. దక్షిణ ప్రావిన్స్ ఆఫ్ గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా H3N8 సబ్‌టైప్ బారిన పడిన మూడవ వ్యక్తి అని డబ్ల్యూహెచ్ఓ మంగళవారం తెలిపింది.
Bird Flu Outbreak In Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. బొకారో జిల్లాలో ప్రభుత్వం నడిపే ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో అక్కడి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. వ్యాధి ప్రభావిత ప్రాంతంలోని 4000 కోళ్లు, బాతులను చంపే ప్రక్రియ ప్రారంభం అయింది. హెచ్5ఎన్1, ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ రకం ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ‘కడక్ నాథ్’ కొళ్లలో గుర్తించారు. దీనివల్ల జిల్లాలోని లోహాంచల్…
Bird Flu Alert In Jharkhand: జార్ఖండ్ లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ కోళ్ల ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. బొకారో జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రతమత్తం అయింది. లోహాంచల్ లోని ప్రసిద్ధ ‘‘కడక్ నాథ్’’ కోళ్ల మాంసంలో హెచ్5ఎన్1 వేరియంట్ ఉన్నట్లు నిర్థారించారు.
Bird flu in Kerala, Order to kill chickens and ducks: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేరళలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూను గుర్తించారు అధికారులు. దీంతో దీన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ అనే రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న 8000 కోళ్లు, బాతులను, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ పీకే…
కేరళ రాష్ట్రాన్ని బర్డఫ్లూ భయపెడుతున్నది. ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అలప్పుజ జిల్లాలో కోళ్లు, బాతులు ఫ్లూ బారిన పడుతున్నాయి. జిల్లాలోని తకళి గ్రామ పంచాయతీలో సుమారు 1200 బాతులు బర్డ్‌ప్లూ బారిన పడటంతో వాటిని అధికారులు పట్టుకొని చంపేశారు. అలప్పుజ జిల్లాలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read: అన్నమయ్య…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూశాయి.. ఇదే సమయంలో అక్కడ బర్డ్‌ఫ్లూ కేసులు కూడా బయటపడి ఆందోళనకు గురిచేశాయి.. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి.. అయితే, తాజాగా మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు కేరళలో వెలుగు చూశాయి. అలప్పుజా జిల్లాలో కొత్తగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు రాష్ట్ర పశుసంవర్ధక…
కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మరో వైరస్ ఇబ్బందు తెచ్చిపెడుతున్నది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతున్నది. బర్డ్‌ఫ్లూ వైరస్‌తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేషన్‌కు వెళ్లాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు. ఈనెల 2 వ తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా,…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి చైనాలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. చైనా తూర్పు ప్రావిన్స్ లోని జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్…