Bird flu: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం..కోళ్లు, బాతులను చంపేయాలని ఆదేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bird flu in Kerala, Order to kill chickens and ducks: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేరళలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూను గుర్తించారు అధికారులు. దీంతో దీన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ అనే రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న 8000 కోళ్లు, బాతులను, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు, క్రిమిసంహారక మందులను చల్లాలని స్థానిక సంస్థలు, జంతు సంక్షేమ శాకలను ఆదేశించింది.
Read Also: S Jaishankar: ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
బర్డ్ ఫ్లూ వెలుగులోకి వచ్చిన ప్రాంతం నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు కోడి, బాతు, కోడిగుడ్లు, మాంసం అమ్మకాలు, దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధించారు. 10 కిలోమీటర్ల పరిధిలోని 19 గ్రామపంచాయతీల్లో కోడి, బాతులు, ఇతర పెంపుడు పక్షల అసాధారణ మరణాలు సంభవిస్తే వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు.
ముఖ్యంగా పక్షులను ప్రభావితం చేసే హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూకు కారణం అవుతుంది. దీన్ని తినడం వల్ల మనుషులకు సోకే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా వలస పక్షలు, సముద్ర పక్షుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. అర్పూకరలోని డక్ ఫామ్ లో, తలయాజమ్ లోని కోళ్ల ఫాంలో చనిపోయిన పక్షుల నమూనాలను పరీక్షల కోసం భోపాల్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపారు. జంతు సంరక్షణ శాఖ, స్థానిక సంస్థలు, రెవెన్యూ, పోలీస్, అటవీ శాఖ, ఆరోగ్య శాఖ సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాలని కొట్టాయం జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?