Supreme Court: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు బిల్సిస్ బానో న్యాయవాది శోభా గుప్తా వెల్లడించారు.
Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల బిల్కిస్ బానో అత్యాచారం కేసులోొ 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బాధితురాలు బిల్కిస్ బానో. ఇదిలా ఉంటే బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది తప్పుకున్నారు.
Home minister narottam mishra comments on Shabana Azmi, Naseeruddin Shah: మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ లపై సంచలన విమర్శలు చేశారు. వీరంతా తుక్డే-తుక్డే గ్యాంగ్ ఏజెంట్లే అని శనివారం అభివర్ణించారు. వీరంతా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుండటంతో నరోత్తమ్ మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నటులు, గీత రచయితలు బీజేపీ రాష్ట్రాల్లోని సమస్యలపై…
shivsena's Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ…
Supreme Court On Bilkis Bano Case: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషులను విడుదల చేయడంతో ప్రతిపక్షాలు గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏకంగా ప్రధాని నరేంద్రమోదిని టార్గెట్ చేశారు. ఎర్రకోటపై మహిళ గౌరవం గురించి మాట్లాడిన 24 గంటల్లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాాల్పడిన వ్యక్తుల్ని విడుదల చేయడాన్ని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా భారత…
Pegasus, PMLA, Bilkis Bano Among Big Cases Set For Hearing in supreme court Today: సుప్రీం కోర్టు ముందుకు నేడు కీలక కేసులు విచారణకు రానున్నాయి. దేశంలో ప్రముఖంగా ఉన్న బిల్కిస్ బానో కేసు నుంచి తీస్తా సెతల్వాడ్ కేసు, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ), పెగాసస్ స్పైవేర్ కేసు, ప్రధాన మంత్రి సెక్యూరిటీ లోపాలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
Supreme Court To Hear Plea Against 11 Convicts' Release in Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఐదు నెలల గర్భవతి బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో 11 మంది దోషులుగా తేలారు.. శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. 11 మంది దోషులను రిమిషన్…