పండగవేళ విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బీహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో ముగ్గురు ప్రయాణికులు రైలు నుండి పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నాసిక్ రోడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూసావల్ వెళ్లే ట్రాక్‌లోని 190/1, 190/3 కిలోమీటరు మధ్య ఈ ప్రమాదం…