బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. సర్వేల అంచనాలకు మించి సునామీ సృష్టించింది. తిరుగులేని శక్తిగా ఎన్డీఏ కూటమి చరిత్ర సృష్టించింది. ఈ విజయం కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చింది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాయి.
సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..! మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఎవిఎస్వో సతీష్ కూమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కూమార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తిరుపతి విజివో, డీఎస్పీ రాంకుమార్ పలుమార్లు సతీష్ కూమార్‌ను తీవ్రంగా వేధించారని తెలిపారు. సిఐడి విచారణలో అధికారులు అతన్ని…
Nitish Kumar: నితీష్ కుమార్ ఓ గొప్ప రాజకీయవేత్త.. పరిణామాలు ఎలా మారుతున్నాయో ఆయన పసిగట్టినంతగా మరెవరికీ సాధ్యం కాదంటారు తన మద్దతుదారులు. ఆయనకు వృద్ధాప్యం మీద పడిందని, బ్యాలెన్స్ కోల్పోతున్నారని, ఆయన ఓ పల్టూరామ్ అని, అధికారం కోసం ఎవరితోనైనా కలిసి నడుస్తారని, ప్రత్యర్థులు ఆయనపై చేసే విమర్శలు. ఈ విమర్శలు అన్నీ ఆయన పటాపంచలు చేస్తూ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు రాబట్టారు. ఆయన ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసిన ప్రజల్లో ఏమాత్రం…
BJP Celebrations: బీహార్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఎన్డీఏ గా ఏర్పడి ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమండ్రిలో సంబరాలు జరుపుకున్నారు బీజేపీ నాయకులు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ లో బీజేపీ శ్రేణులు బీహార్ విజయోత్సవాలను జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి, ఆ తర్వాత హాజరైన కార్యకర్తలకు మిఠాయిలు పంచి.. ‘బీజేపీ వర్ధిల్లాలి’.. ‘నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి’ అని పెద్ద ఎత్తున నినాదాలు…
Asaduddin Owaisi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అద్భుత ప్రదర్శన చేసినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించిన లేదా ఆధిక్యంలో ఉన్న ఐదు స్థానాల ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రజలు ఏఐఎంఐఎంకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఐదు స్థానాల్లో కష్టపడి పనిచేసిన అభ్యర్థులు, పార్టీ సభ్యులకు ఒవైసీ అభినందనలు తెలిపారు. Narendra Modi…
Akhilesh Yadav: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం నమోదు చేసింది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఏకంగా 200+ పైగా సీట్లను సాధించే దిశగా వెళ్తోంది. ఆర్జేడీ-కాంగ్రెస్-కమ్యూనిస్టుల కూటమి ‘‘మహాఘట్బంధన్’’ తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 30 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది.
Rahul Gandhi: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించే దిశగా పయణిస్తోంది. మొత్తం 243 సీట్లలో 201 స్థానాల్లో బీజేపీ-జేడీయూ కూటమి ఆధిక్యంలో ఉంది. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి కేవలం 36 స్థానాల్లోనే ఆధిక్యత కనబరుస్తోంది. ఈ దశలో బీజేపీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్లు వేసింది.
బీహార్ ఎన్నికలకు ముందు అంతన్నారు.. ఇంతన్నారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ బొక్కబొర్లా పడ్డారు. ఇదంతా ఎవరి గురించి అంటారా? అదేనండీ.. ఇండియా కూటమి గురించి. ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంది.
Bihar Election Results: బీహర్ ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కన్నా ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా వెళ్తోంది. మొత్తం 243 సీట్లలో బీజేపీ-జేడీయూ కూటమి 190కి పైగా స్థానాలను కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.