బీహార్ ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. అన్ని పార్టీలు ఎవరికి వారే గంపెడాశలు పెట్టుకున్నాయి. సర్వే ఫలితాలు అధికార కూటమికే అనుకూలంగా ఉన్నా.. విపక్ష కూటమి కూడా ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని చెబుతోంది.
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తం ఆసక్తి నెలకొంది. రేపు (నవంబర్ 14)న కౌంటిక్ జరగబోతోంది. బీహార్‌లో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనా?, మహాఘట్బంధన్ కూటమా? అనేది రేపటితో తేలబోతోంది. అయితే, కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఆర్జేడీ నేత సునీల్ సింగ్ ఎన్నికల అధికారుల్ని హెచ్చరించారు.
Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేపే బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కింపు ఉండగా.. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఈవీఎంలకు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.
Bihar exit poll: బీహార్ ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు తెలుస్తాయి. అయితే, ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ బీహార్‌లో మరోసారి బీజేపీ+జేడీయూల ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. తాజాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.
Bihar Elections 2025: భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా రికార్డు స్థాయిలో 66.91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 65.08 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఇదిలా ఉండగా, మంగళవారం(నవంబర్ 11)న జరిగిన రెండవ దశలో 68.76 శాతం పోలింగ్ నమోదైంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మండిపడ్డారు. ‘గోడి మీడియా’ చేస్తున్న తప్పుడు సర్వేలు అని ధ్వజమెత్తారు. బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బీహార్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైయింది. రెండు విడతలు జరిగిన ఓటింగ్‌లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. తొలి విడతలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. రెండో విడతలో రికార్డ్ స్థాయిలో 67.14 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి.
BJP: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజుతో ముగిశాయి. అన్ని ఎగ్జిట్స్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే గెలుస్తుందని చెప్పాయి. మరోసారి, బీజేపీ+జేడీయూలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేస్తాయని వెల్లడించాయి. ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘటబంధన్ కూటమి మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతాయని అంచనా వేశాయి.
Bihar Exit Polls: దేశంలో రాజకీయంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. అందరి చూపు కూడా బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారే దానిపై నెలకొంది. బీహార్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై అంచనాలు పెంచింది. బీహార్‌లోని మొత్తం 243 నియోజకవర్గాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశలుగా ఓటింగ్ నిర్వహించారు. తొలి విడతలో 65.08 శాతం నమోదు కాగా, రెండో…