Asaduddin Owaisi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అద్భుత ప్రదర్శన చేసినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభినందించారు. ఏఐఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించిన లేదా ఆధిక్యంలో ఉన్న ఐదు స్థానాల ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ ప్రజలు ఏఐఎంఐఎంకు ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఐదు స్థానాల్లో కష్టపడి పనిచేసిన అభ్యర్థులు, పార్టీ సభ్యులకు ఒవైసీ అభినందనలు తెలిపారు.
Narendra Modi : మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం
బీహార్ ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సీఎం నితీష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఏఐఎంఐఎంకు బలమైన పట్టు ఉన్న సీమాంచల్ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మా పార్టీ బీహార్‌లో మాత్రమే కాకుండా సీమాంచల్ ప్రాంతంలో కూడా శ్రేయస్సును తీసుకురావడానికి కృషి చేస్తుంది. అక్కడి ప్రజల కోసం పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించబడతాయి. మేము సీమాంచల్ సంక్షేమం కోసం పనిచేస్తామని ఒవైసీ అన్నారు.
Uttar Pradesh: అమానుషం.. భార్య, ముగ్గురు పిల్లలను హతమార్చి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త..!
ఈ సందర్భంగా ఒవైసీ.. రాష్ట్రీయ జనతా దళ్ (RJD)పై విమర్శలు గుప్పించారు. ‘M-Y’ (ముస్లిం-యాదవ్) కలయికపై బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్జేడీ బీజేపీని అడ్డుకోలేదని తాను ఇప్పటికే ప్రకటించానని ఒవైసీ గుర్తు చేశారు. ఆర్జేడీ బీజేపీని ఆపలేదని నేను ఎప్పుడూ చెప్పేవాడిని. ‘M-Y’ కలయికతో బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టించారు. ప్రజలు ఈ ఫాసిస్ట్ శక్తులకు ఓటు వేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.
#WATCH | Hyderabad, Telangana | On AIMIM winning 4 seats and leading on 1 in the #BiharElections, party Chief Asaduddin Owaisi says, "I want to thank the people of Bihar for voting for AIMIM. I also want to thank and congratulate all the candidates and party members on those 5… pic.twitter.com/KPEjsBX8Ha
— ANI (@ANI) November 14, 2025