బీహార్‌లో బీజేపీ చాలా దూకుడుగా కనిపిస్తోంది. బీజేపీ పూర్తిగా తన అభ్యర్థులను ప్రకటించేసింది. మూడు విడతల్లో 101 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఇక ప్రతిపక్షం నుంచి ముఖ్యమంత్రి రేసులో ఉన్న తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్న రఘోపూర్ నుంచి సతీష్ కుమార్ యాదవ్‌ను బీజేపీ రంగంలోకి దింపింది.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమీపం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ తన అభ్యర్థుల రెండో లిస్టును రిలీజ్ చేశాయి. 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించిన జానపద గాయని మైథిలి ఠాకూర్ పేరు కూడా సెకండ్ లిస్టులో ఉంది. ఆమె రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరింది. మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు.
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీహార్ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకోవైపు అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది.
‘జన్ సురాజ్’ అధినేత, పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025 బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకున్నా.. పార్టీ కోసం మాత్రం పనిచేస్తానని వెల్లడించారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికలు రెండు దశల్లో (నవంబర్ 6, 11) జరగనున్నాయి. నవంబరు 14న ఫలితాలు వెల్లడి…
Maithili Thakur: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ బీజేపీలో చేరారు. బీహార్‌లో వ్యాప్తంగా మైథిలి జానపద సింగర్‌గా ఈమెకు పేరుంది. బీహార్ ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె వచ్చే ఎన్నికల్లో అలీనగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో చేరాలనుకుంటున్నట్లు ఆమె గతంలో చెప్పింది.
బీహార్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీహార్‌లో ప్రస్తుతం సీట్ల పంపకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా ఆర్జేడీ తీవ్ర కసరత్తు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
Bihar Elections 2025: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా సొంత పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగారు.…
బీహార్‌లో హైవోల్టేజ్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది.