Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌ల ఎన్డీయే కూటమి సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాలో పోటీ చేయనున్నాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి 29 సీట్లు దక్కాయి. రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM), హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయి. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో…
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్డీయే, మహాఘటబంధన్ కూటములు సీట్ల షేరింగ్‌పై చర్చోపచర్చలు నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, మరోవైపు రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో వివాదం మరింత ముదురుతోంది.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు “బీజేపి పార్లమెంటరీ బోర్డు” సమావేశం కానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే బీజేపి పార్లమెంటరీ బోర్డు సమవేశంలో కీలక నేతలు పాల్గొననున్నారు. సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజనాధ్ సింగ్, డా. లక్ష్మణ్ లాంటి తదితర సీనియర్ కీలక నేతలతో పాటు, పార్టీ “కేంద్ర ఎన్నికల కమిటీ”కి చెందిన ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. Also Read: Kadapa : కడపలో సంచలనం..! గుట్టుచప్పుడు కాకుండా సిజేరియన్లు…
Bihar Elections: బీహర్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్డీయే, ఇండియా కూటముల్లో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ సమయంలో, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఇండియా కూటమికి బిగ్ షాక్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 100 సీట్లలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు ఎంఐఎం శనివారం తెలిపింది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. బీహార్‌లో తాము థర్డ్ ఫ్రండ్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు…
యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు
Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్ది ఆ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. భోజ్‌పురి స్టార్ హీరో, బీజేపీ నాయకుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్(పీకే)తో శుక్రవారం భేటీ అయ్యారు. పవన్ సింగ్ రెండో భార్య జ్యోతిసింగ్ ఇటీవల తన భర్తపై ఆరోపణలు చేసింది. పవన్ సింగ్‌పై ఇటీవల జ్యోతిసింగ్ వివాహేతర సంబందాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన భార్య పీకేను కలవడం…
బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. ఏఐ-జనరేటెడ్ వీడియోలను దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
బీహార్‌లో ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగబోతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మరోసారి అధికారం కోసం ఎన్డీఏ కూటమి.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష కూటమి తహతహలాడుతున్నాయి.
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు.
బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోగా.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి.