బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఊహించని రీతిలో ఫలితాల్లో సునామీ సృష్టించింది. గురువారమే కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక పాత ప్రభుత్వం రద్దు సిఫార్సు బుధవారం నుంచి అమల్లోకి రానుంది. ఇక ఈ రోజు ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనన్నారు.
ఇది కూడా చదవండి: Delhi: ఓ వెడ్డింగ్‌లో సల్మాన్-షారూఖ్ డ్యాన్స్.. వీడియో వైరల్
అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ నుంచి ఒక మహిళా డిప్యూటీ సీఎం ఉంటారని వార్తలు వినిపించాయి. కానీ అందుకు భిన్నంగా బుధవారం రాష్ట్ర బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వంలో కూడా ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కొనసాగుతారని బీజేపీ నిర్ణయం తీసుకుంది. సామ్రాట్ చౌదరిని బీజేపీ శాసనసభా పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. అలాగే విజయ్ సిన్హాను కూడా పార్టీ ఉప శాసనసభా పార్టీ నాయకుడిగా నియమించారు. బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Al-Falah University: ఈడీ దాడుల ఎఫెక్ట్.. పలువురు ప్రొఫెసర్లు.. స్థానికులు అదృశ్యం.. రంగంలోకి హర్యానా డీజీపీ
నవంబర్ 20న పాట్నాలోని గాంధీ స్టేడియంలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ముచ్చటగా పదోసారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీసీ 19, కాంగ్రెస్ 6, ఆర్జేడీ 25, ఎంఐఎం 6 స్థానాలు సాధించాయి.