Daggubati Purandeswari: ఎన్డీఏ కూటమి బీహార్‌లో అద్భుతమైన విజయం సాధించిందని 68 శాతం ఓటింగ్ సాధించడం గొప్ప విశేషమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో చేసుకుని వెళ్తే విజయాలు ఎలా ఉంటాయో ఇది ఒక నిదర్శనమని ఆమె అన్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ దేశంలోనే అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఉందని, బీహార్ ప్రజలు ఎన్డీఏకు మళ్లీ పట్టం కట్టారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఇవే ఫలితాలు ఎన్డీఏకు రాబోతున్నాయని…
Storyboard: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ దుమ్ము రేపింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఊహకందని రీతిలో ఈ కూటమి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. గెలిచిన పార్టీల నేతలు కూడా అంచనా లేని విధంగా ప్రజలు విజయం కట్టబెట్టారు. 243 స్థానాలకు గాను ఏకంగా 200 స్థానాలకు పైగా గెలిచింది. ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా మరోసారి బిహార్‌లో ఎన్డీఏకు తిరుగులేదని తాజా ఫలితాలు…
బీహార్‌లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు జరగనుంది. ఇదిలా ఉంటే ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. క్రమక్రమంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
జంగిల్ రాజ్ పాలనలో బీహార్‌లో అభివృద్ధి శూన్యమని.. మళ్లీ ఆ రోజులు ఎవరూ కోరుకోవద్దని ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో రెండు విడతలో జరిగే నియోజకవర్గాల్లో గురువారం మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్జేడీ నేతృత్వంలోని విపక్ష కూటమిపై విరుచుకుపడ్డారు.
బీహార్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
బీహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలి విడతలో భాగంగా 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటుండగా.. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Bihar elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే పార్టీలో పొత్తులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 243 సీట్లకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తుంగా, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలు ఎన్డీయే మిత్రపక్షాలకు దక్కాయి.
Story Board: మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఏ కూటమికీ పూర్తి సంతోషాన్నివ్వలేదు. సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం బీజేపీకి షాకిస్తే.. అనుకున్నట్టుగా ఫలితం రాకపోవడం కాంగ్రెస్‌నూ నిరాశపరిచింది. ఇలాంటి స్థితిలో ఆ తర్వాత జరిగిన వరుస అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. మోడీ మ్యాజిక్ తగ్గలేదని బీజేపీ సింహనాదం చేసింది. కానీ అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఓట్ల చోరీకి సాక్ష్యాలు చూపించడంతో.. కాంగ్రెస్ ఓ పద్ధతి ప్రకారం…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 243 మంది సభ్యులు కలిగిన బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22తో ముగుస్తుంది. రెండు విడతల్లో ఎన్నిలకలు నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపారు. నవంబర్ 6న ఫస్ట్ ఫేజ్ పోలింగ్,11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తొలిదశ పోలింగ్ కు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబర్ 14న కౌంటింగ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు.…
Bihar Assembly elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ ఏడాది చివర్లో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 22, 2025తో ముగుస్తుంది. దీనికి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. దీపావళి, ఛత్ పండగల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. Read Also: Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా…