బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ లో టెన్షన్ షురూ అయ్యింది! 19 మంది సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపి, ఆదివారం దానికి తాళం వేసిన కింగ్ నాగార్జున శనివారం సభ్యుల ముందుకు వచ్చారు. నాగ్ రాక కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సభ్యులంతా కలర్ ఫుల్ డ్రసెస్ తో దర్శనమిచ్చారు. నాగ్ సైతం వీరందరి డ్రస్సింగ్ సెన్స్ చూసి…. కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం. నాగ్ తో సభ్యులు జరిపిన సంభాషణ, ఆ తర్వాత జరిగిన…
“బిగ్ బాస్ సీజన్ 5” విజయవంతంగా నడుస్తోంది. ఈ షో రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్నప్పటికీ మంచి స్పందనే వస్తోంది. గత ఎపిసోడ్ రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. అయితే ఈసారి కూడా పెద్దగా పరిచయం లేని ముఖాలనే హౌస్ లోకి పంపారు. ఇక వాళ్ళేమో గొడవలతోనే ఈ నాలుగైదు ఎపిసోడ్లను నెట్టుకొచ్చారు. మరోవైపు లవ్ స్టోరీలకు తెర తీయడానికి కొన్ని జంటలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్లలో 6 మంది పోటీదారులు…
ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ నాలుగు సీజన్స్ పూర్తి చేసుకుని 5వ సీజన్ లోకి అడుగు పెట్టింది ఈ షో. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా 2వ సీజన్ కు నాని హోస్ట్ గా మారాడు. ఆ తర్వాత మూడు, నాలుగు సీజన్స్ తో పాటు ప్రస్తుతం నడుస్తున్న 5వ సీజన్ కు కూడా నాగార్జుననే…
“బిగ్ బాస్ 5” ప్రారంభమై 4 ఎపిసోడ్లు గడిచాయి. కంటెస్టెంట్స్ ఎవరి పెర్ఫార్మన్స్ లో వారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడంలో విఫలం అవుతున్నారు. లహరి వంటి కంటెస్టెంట్ల దూకుడును వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అయితే లహరి బిహేవియర్ ప్రేక్షకులను తెగ చిరాకు పెట్టేస్తోంది. ఆమె దాదాపుగా నోరు తెరిచిందంటే గొడవే. ఈ నాలుగు రోజుల ఎపిసోడ్ లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందా ? అంటే.. ఒకటి ఏడుపు, రెండు గొడవలు. కంటెస్టెంట్స్ అందరిలో…
బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజునే చప్పగా అయిపోయింది. ఈ రోజుకు సంబంధించిన షో… ఎలాంటి ఉత్సాహం వ్యూవర్స్ లో కల్పించలేకపోయింది. మరీ ముఖ్యంగా డే ప్రారంభం నుండి ముగింపు వరకూ వ్యూవర్స్ సహనాన్ని పరీక్ష పెట్టింది. పవర్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత మానస్… కంటెస్టెంట్స్ అందరూ నిద్రపోయిన తర్వాతే ఆర్జే కాజల్ నిద్రపోవాలని చెప్పాడు. అయితే దాని వెనుక ఏదో సీక్రెట్ టాస్క్ దాగి ఉందనే అనుమానంతో మెజారిటీ సభ్యులు నిద్ర…
బిగ్ బాస్ సీజన్ 5లో స్మోకింగ్ పర్శన్ జాబితాలో ఇప్పటికి ముగ్గురు చేరారు. లోబో, సరయు రెండో రోజు స్మోకింగ్ జోన్ లో గుప్పుగుప్పున దమ్ముకొట్టే సీన్స్ ను ప్రసారం చేశారు. అయితే… నిజానికి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే లోబో, సరయుతో కలిసి హమీదా సైతం రింగులు రింగులుగా సిగరెట్ పొగను వదిలింది. చిత్రం ఏమంటే హమీదా స్టైల్ గా దమ్ము కొట్టిన సీన్స్ ను ఎడిట్ చేశారు. లేలేత నాజూకు అందాలతో…
లోబో ను ఒకసారి చూసినవాళ్లు ఎవరూ జీవితంలో అతన్ని మర్చిపోలేరు! అతగాడి వేషధారణ, ప్రవర్తన అంత డిఫరెంట్ గా ఉంటుంది. మాటీవీ మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా చేస్తుండే లోబో… కొన్ని సినిమాల్లోనూ కమెడియన్ గా నటించాడు. కానీ ఎందుకో రావాల్సినంత గుర్తింపు రాలేదు. బహుశా అతని నటనలో మొనాటనీ అందుకు కారణం కావచ్చు. గతంలో ఓ సారి బిగ్ బాస్ షో కు ఎంపికైన లోబో…. ఆ విషయాన్ని లీక్ చేయడంతో చివరి క్షణంలో…
బిగ్ బాస్ సీజన్ 5 రెండో రోజుకే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలైపోయింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మానేసి అసహనం ప్రదర్శించడం మొదలెట్టేశారు. ఇక మొదటి వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఆరుగురి (సరయు, జస్వంత్, రవి, హమీద, మానస్, కాజల్)లో రెండో రోజు ఫోకస్ మొత్తం ఇద్దరు, ముగ్గురి మీద ఉండటం విశేషం. నిజానికి ఈ ఆరుగురికి సంబంధించిన దిన చర్యలను ఎక్కువగా చూపించి ఉంటే… వ్యూవర్స్ కు వాళ్ళ మీద ఓ…
సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో నిన్న రాత్రి మూడవ ఎపిసోడ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడవసారి నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటిసారిగా 19 మంది పోటీదారులతో బిగ్ బాస్ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో పోటీదారులతో ప్రీమియర్ అయిన ఏకైక సీజన్ ఇదే. బుల్లితెర ప్రేక్షకులకు బోరింగ్ ను దూరం చేస్తామని, 5 రెట్లు ఎక్కువ వినోదాన్ని అందిస్తామంటూ మొదలు పెట్టిన ఈ షోలో మొదటివారం ఎలిమినేషన్…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-5” స్టార్ట్ అయ్యి మూడు రోజులుగా అవుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బాగానే సాగింది. సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు. అయితే మూడవ రోజు కంటెస్టెంట్స్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కన్పించింది. ఎవరికి వారు ఫుల్ గా ప్రిపేర్ అయ్యే ఈసారి హౌస్ లో అడుగు పెట్టినట్టు కన్పిస్తోంది. ఈ మూడు రోజులు జరిగిన ఎపిసోడ్లు…