బిగ్ బాస్ 5 : ఈ సీజన్లో ఆ ట్విస్ట్ లేనట్టేనా… మేకర్స్ షాకింగ్ నిర్ణయం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 5న అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షో నిన్న రాత్రి మూడవ ఎపిసోడ్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడవసారి నాగార్జున బిగ్ బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మొదటిసారిగా 19 మంది పోటీదారులతో బిగ్ బాస్ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో పోటీదారులతో ప్రీమియర్ అయిన ఏకైక సీజన్ ఇదే. బుల్లితెర ప్రేక్షకులకు బోరింగ్ ను దూరం చేస్తామని, 5 రెట్లు ఎక్కువ వినోదాన్ని అందిస్తామంటూ మొదలు పెట్టిన ఈ షోలో మొదటివారం ఎలిమినేషన్ కోసం ఆరుగురు పోటీదారులు నామినేట్ అయ్యారు.
తాజా సీజన్లో సగం మంది కంటెస్టెంట్స్ ఎవరో కూడా ఆ షో చూసేవాళ్లెవరికి తెలియదు. దీంతో ప్రారంభంలోనే ‘బిగ్ బాస్’ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రతిసారి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే ఓ స్పెషల్ ట్విస్ట్ ఈసారి ఈ సీజన్ లో ఉండబోదని అంటున్నారు.
Also Read
Read Also : బిగ్ బాస్-5 : ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది తనేనా ?
“బిగ్ బాస్-5″లో అసలు ఆ ట్విస్ట్ వుంచకూడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. రియాలిటీ షో “బిగ్ బాస్ 5” సీజన్‌లో ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండదని వార్తలు వస్తున్నాయి. దీనికి కరోనా కూడా దీనికి కారణం అయి ఉండొచ్చు. మరోవైపు ఫస్ట్ వీక్ వచ్చే టిఆర్పీ రేటింగ్‌ల ఆధారంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తాజా, పాపులర్ ముఖాన్ని షోలోకి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు లభించిన “పవర్ రూమ్” యాక్సెస్ కూడా ‘బిగ్ బాస్’ కొత్తగా ప్రవేశ పెట్టిందే. ఇది ఇంతకుముందు సీజన్లలో లేదు. అలాగే ఈ సీజన్లో చాలా కొత్త సర్ప్రైజ్ లను మేకర్స్ ప్లాన్ చేశారని అంటున్నారు. కాగా ఈ రియాలిటీ షో వారం ఎపిసోడ్‌లు రాత్రి 10 గంటలకు, వారాంతపు ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతాయి.
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..