బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ లో టెన్షన్ షురూ అయ్యింది! 19 మంది సభ్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపి, ఆదివారం దానికి తాళం వేసిన కింగ్ నాగార్జున శనివారం సభ్యుల ముందుకు వచ్చారు. నాగ్ రాక కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సభ్యులంతా కలర్ ఫుల్ డ్రసెస్ తో దర్శనమిచ్చారు. నాగ్ సైతం వీరందరి డ్రస్సింగ్ సెన్స్ చూసి…. కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం. నాగ్ తో సభ్యులు జరిపిన సంభాషణ, ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఈ రోజు యాని మాస్టర్ నిలిచింది. తన కెరీర్ లో ఏనాడూ కోపాన్ని ప్రదర్శించని యానీ మాస్టర్… తొలిసారి బిగ్ బాస్ హౌస్ లో సహనాన్ని కోల్పోవడం పట్ల నాగార్జున ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, యానీ సైతం తాను టెంపర్ కోల్పోయిన విషయాన్ని అంగీకరించింది. ఇక ప్రియాంక (పింకీ) అందరితో కలివిడిగా ఉంటూ హగ్ చేసుకోవడం సూపర్ గా ఉందని నాగ్ కితాబిచ్చారు. ఆర్జే కాజల్ పెళ్ళికాని వారి గురించిన వివరాలు సేకరించడం గమనించిన నాగార్జున, ‘మేట్రిమోనియల్ సెంటర్ ఏమైనా తెరిచావా?’ అంటూ ఆటపట్టించారు. అంతేకాదు… కాజల్ అందరితో చెబుతున్నట్టు ఆమెకు వంట రాదనేది వాస్తవం కాదని, ఆమె వంట చేసిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వున్నాయనే విషయాన్ని నాగ్ బట్టబయలు చేశారు. అయితే… కరోనా టైమ్ లో కేవలం యూట్యూబ్ చూసే తాను ఆ వంటలు చేశానంటూ కాజల్ సర్థిచెప్పే ప్రయత్నం చేసింది. శ్వేతవర్మను మాత్రం ఇంకాస్త ఇన్వాల్వ్ కావాలని, రిజర్వ్డ్ గా ఉండొద్దని నాగ్ సలహా ఇచ్చారు. ఇక ఉమ అండ్ కాజల్ మధ్య వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. యాని మాస్టర్ లో తల్లిని చూసుకుంటున్నానని శ్వేత, షణ్ముఖ్ తనకు చక్కని సలహాలు ఇస్తూ తండ్రిని గుర్తు చేశాడంటూ లోబో కన్నీళ్ళు పెట్టుకోవడం కొసమెరుపు! సరయు మాటలకు హర్ట్ అయిన కెప్టెన్ సిరి సైతం ఈ రోజు కంట తడిపెట్టుకుంది.
ఇక బిగ్ బాస్ తరఫున నాగ్ సైతం శనివారం ఓ గేమ్ ను కండక్ట్ చేశారు. ‘ఎవరితో సెట్… ఎవరితో కట్’ అనే ఈ గేమ్ లో షణ్ముఖ్, శ్వేతవర్మ, రవి, ప్రియ, ప్రియాంక, యాని లతో సెట్ అయ్యామని ఇద్దరిద్దరు చెప్పారు. అయితే ఏకంగా ఏడుమంది కంటెస్టెంట్స్ కాజల్ తో కట్ అవ్వడ్డం చిత్రం. కాజల్ లోని అత్యుత్సాహమే చివరకు ఆమె కొంప ముంచబోతోందా? అనే సందేహం కలుగుతోంది. ప్రతి ఒక్కరి విషయంలోనూ కాజల్ తలదూర్చడం వాళ్ళను ఇబ్బందికి గురి చేస్తోందనేది దీన్ని బట్టి అర్థమౌతోంది.
Read Also : బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ఎలిమినేషన్ కు ఆరుగురు సభ్యులు నామినేట్ అయిన విషయం తెలిసిందే! సరయు, కాజల్, మానస్, రవి, జస్వంత్, హమీద ఇందులో ఉన్నారు వీరిలో చెత్త బుట్టలోని గ్రీన్ కలర్ సర్కిల్ షీట్ రావడంతో ఫస్ట్ రౌండ్ లో రవి సేఫ్ అయిపోయాడు. ఇక రెండో రౌండ్ లో జరిగిన గ్లాసు కింద బాల్ ద్వారా హమిదా ఎలిమినేషన్స్ నుండి సేఫ్ అయిపోయింది. సో… డేంజర్ జోన్ లో ప్రస్తుతం సరయు, కాజల్, జెస్సీ, మానస్ ఉన్నారు. వీరితో హౌస్ లో ఎక్కువ నెగెటివ్ మార్క్స్ తెచ్చుకుంది కాజల్, ఆ తర్వాత జెస్సీనే! అయితే… కాజల్ కు బిగ్ బాస్ హౌస్ బయట అభిమానగణం బాగానే ఉంది. వారందరూ ఆమెకు ఓటు వేస్తే ఆమె కూడా సేఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే పలు సినిమాలలో, టీవీ సీరియల్స్ లో నటించిన మానస్ కు కాస్తంత గుర్తింపు ఉంది. సో ఆడియెన్స్ ఓటింగ్ తో అతను కూడా సేవ్ కావచ్చునన్నది కొందరి అభిప్రాయం. ఇక బోల్డ్ గా మాట్లాడే సరయు, మోడల్ జెస్సీ… ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో!!